Share News

ప్రజల కోసం పని చేసిన వారికే గుర్తింపు..

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:47 AM

ప్రజల కోసం పనిచేసిన నాయకుల కే తగిన గుర్తింపు లభిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజల కోసం పని చేసిన వారికే గుర్తింపు..

వేములవాడ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజల కోసం పనిచేసిన నాయకుల కే తగిన గుర్తింపు లభిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పురపాలక సంఘం పాలకవర్గం సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేయడమే తొలి ప్రాధా న్యంగా పెట్టుకోవాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయా లు చేయాలని, మిగతా సమయంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి పనిచేయాలన్నారు. కేవలం అధికారమే పరమావధిగా పనిచేయడం వల్ల ఫలితం ఉండదని, న్నారు. గత ఐదేళ్ల కాలంలో వేములవాడ పట్టణాన్ని రూ.110కోట్లతో అభివృద్ధి చేయడం శుభ పరిణామమని, రాబోయే రోజుల్లోనూ వేములవాడ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. పదవీకాలం పూర్తి చేసుకున్న మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సన్మానించగా, మున్సిపల్‌ పాలకవర్గం తరఫున ఆది శ్రీనివాస్‌ను సన్మానించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ అన్వేష్‌, వైస్‌ చైర్మన్‌ మహేష్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:48 AM