రమణీయం రామలింగేశ్వరుడి రథోత్సవం
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:52 AM
మండలంలోని జంగమరెడ్డిపల్లె గ్రామంలో రామలింగేశ్వరుడి రథోత్సవం రమణీయంగా జరిగింది. గ్రామంలోని రామలింగేశ్వర స్వామి మహోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది.

- రథాన్ని లాగడానికి పోటీపడిన భక్తులు
- తలపై గండదీపంతో ప్రదక్షిణలు
ఇల్లంతకుంట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జంగమరెడ్డిపల్లె గ్రామంలో రామలింగేశ్వరుడి రథోత్సవం రమణీయంగా జరిగింది. గ్రామంలోని రామలింగేశ్వర స్వామి మహోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. ఆలయం చుట్టు రథం తిరగడం ఆనవాయితీ కాగా రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. తలపై గండదీపం పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. సిరిసిల్ల రూరల్ సీఐ మొగలి, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ దూరంగా ఏర్పాటు చేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
- స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
రామలింగేశ్వర స్వామి ఉత్సవాలల్లో భాగంగా జరిగిన రథోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కులు తీర్చుకోగా, ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ మాజీవైస్ చైర్మన్ సిద్దం వేణు, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్‌రెడ్డి, ఏఎమ్‌సీ చైర్‌పర్సన్ ఐరెడ్డి చైతన్యమహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు రాఘవరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహ్మరెడ్డి నాయకులు వినయ్‌కుమార్, పసుల వెంకటి, ఉడుతల వెంకన్న, కేవీఎన్‌రెడ్డి, తూముకుంట శ్రీలత, తూముకుంట రాజేందర్‌రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.