విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:15 AM
విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు అన్నారు. సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు.
సైదాపూర్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు అన్నారు. సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం వంట వండుతున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈవో జనార్దన్‌రావు మాట్లాడుతూ ఐఎఫ్‌బీ ప్యానెల్ బోర్డులను పాఠశాలలో వినియోగించాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థులకు బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ప్రవీణ్‌కుమార్, తిరుపతిరెడ్డి, సరిత, పవన్‌కుమార్ పాల్గొన్నారు.