మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:39 AM
మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ హెచ్చరించారు.
ఎల్లారెడ్డిపేట, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లోని జ్ఞానదీప్ హైస్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై బుధవారం అవగాహన కల్పించారు. అంతకుముందు ప్రధాన రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీవో లక్ష్మణ్ మాట్లాడు తూ తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. అతి వేగం, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణకు పాటు పడాలన్నారు. వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టీఐడీఎస్ రాజన్న సిరిసిల్ల ప్రిన్సిపాల్ దొరయ్ మురగన్ వాహనాలను ఎవరు నడిపించా లి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్ర తిజ్ఞ చేశారు. పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. అసిస్టెంట్ ఎంవీఐ పృథ్వీరాజ్‌వర్మ, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.