Share News

ప్రజా గాయకుడు గద్దర్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:06 AM

పద్మ అవార్డుల ఎంపికలో ప్రజా గాయకుడు గద్దర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల మహా నాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు డిమాండ్‌ చేశారు.

ప్రజా గాయకుడు గద్దర్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

సిరిసిల్ల టౌన్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : పద్మ అవార్డుల ఎంపికలో ప్రజా గాయకుడు గద్దర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల మహా నాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిరిసిల్ల పట్టణ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ప్రజా ఉద్యమ గాయకుడు గద్దర్‌ను అవమానించడం బాధాకరమన్నారు. బీసీ మండల్‌ కమిషన్‌ కోసం నాడు గద్దర్‌ గజ్జెలు కట్టి ప్రజా ఉద్యమం చేశాడని, బీసీ బిడ్డ అయిన బండి సంజయ్‌ గద్దర్‌ను విమర్శించడం సరికాదన్నారు. నక్సలైట్‌ గా గద్దర్‌ ఎంత మందిని చంపాడో ఈనెల 30 లోపు రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 30న సిరిసిల్ల పట్టణం అంబద్కేర్‌ చౌర స్తావద్ద తాము ఉంటామని బండి సంజయ్‌ వ చ్చి రుజువుచేయాలని డిమాండ్‌ చేశారు. పద్మ అవార్డులు ఇవ్వాలని గద్దర్‌ కుటుంబం అడగలే దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింద న్నారు. అనవసరమైన విమర్శలు చేయవద్దన్నా రు. బీసీ నాయకుడని దళితులకు బండి సంజ య్‌ అంటే అభిమానం ఉందని, ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు పలికారు. సమావేశం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2025 | 01:06 AM