‘భరోసా’తో బాధిత మహిళలకు రక్షణ
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:54 AM
బాధిత మహిళలకు రక్షణ కోసం భరోసా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): బాధిత మహిళలకు రక్షణ కోసం భరోసా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని శ్రీన గర్ కాలనీలో గల భరోసా కేంద్రం వార్షికోత్సవంలో భాగంగా ఆయన కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా కేంద్రం బాధిత మహిళలకు, బాలికలకు వైద్యం, కౌన్సె లింగ్, ఇతర రకాల సేవలు అందించడంతో పాటు పోలీస్‌లకు అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పిస్తుందన్నారు. భరోసా కేం ద్రం ద్వారా బాధిత మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామ న్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే ముందంజలో ఉన్నామ న్నారు. భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అం దించడానికి, ఆపదకు లోనైన వారికి పోలీస్‌స్టేషన్‌లకు, ఆసుపత్రు లకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడా నికి ఏర్పాటు చేయబడ్డాయన్నారు. హింస, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలకు రక్షణ కల్పించడమే లక్ష్యమన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు, బాలికలకు సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్‌లో నమోదు కాబడిన సమయం నుంచి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ, భరోసా సెంటర్ల గురించి అవగాహన కల్పిస్తున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏవో పద్మ, ఎస్‌ఐ జ్యోతి, ఎస్‌ఐలు అశోక్, పృథ్విందర్‌గౌడ్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ అధి కారి అనంత, స్వభావతి, వెన్నెల, రిసెప్షనిస్ట్ మల్లీశ్వరీ, ఎఎన్‌ఎం పవ ణిత తదితరులు పాల్గొన్నారు.