Share News

హామీలను అమలు చేసి ఓట్లు అడగాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:49 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

హామీలను అమలు చేసి ఓట్లు అడగాలి

సిరిసిల్ల రూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంకారపు ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం సిరిసిల్ల నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నా హక సమావేశాన్ని జిల్లా ప్రధానకార్యదర్శి రెడ్డబోయిన గోపీ అధ్యక్షతన నిర్వహించారు. అంజిరెడ్డి మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు ఇంక్రిమెంట్‌ ఇన్సూరెన్స్‌ చేయలేదని, అదే బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. యువతను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిన ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. అనంతరం జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లను అభ్యర్ధించడంతోపాటు బార్‌అసోషియేషన్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పార్లమెంట్‌ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌, మహిళ మోర్చా జిల్లా అఽధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మీ, రాష్ట్ర కమిటీ సభ్యు లు గరిపెల్లి ప్రభాకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రా గుల రాజిరెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్‌ కారెడ్ల మల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:49 AM