Share News

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:51 AM

మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్‌, ప్రధాన విభాగాలతో పాటు జిల్లా ఆర్మ్‌డ్‌ విభాగం కూడా సమర్థవంతంగా పనిచేస్తొంద ని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అభినందించారు. సాయుధ దళాల వార్షిక పునశ్చరణ (మోబిలైజేషన్‌) ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌కార్యా లయంలో పరేడ్‌ మైదానంలో సాయుధ దళ పోలీసుల సమీకరణ కవాతు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రై సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగు ణంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్‌, ప్రధాన విభాగాలతో పాటు ఆర్మ్‌డ్‌ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని అదే ఉత్సాహంతో భవిష్యత్తులో ఎదురైయ్యే సవాళ్ళను ఎదు ర్కోవడానికో సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పిలుపుని చ్చారు. ఆర్మడ్‌ రిజర్వ్‌ సాయుధ దళాలు యాన్యువల్‌ మొబిలైజేషన్‌ శిక్షణలో భాగంగా సిబ్బందికి,అధికారుల కు అర్మ్‌డ్‌ డ్రిల్‌, లాఠీ డ్రిల్‌, ఫుట్‌ డ్రిల్‌, సెర్మొనల్‌ డ్రిల్‌, గార్డ్‌ మౌంటింగ్‌, మాబ్‌ ఆపరేషన్‌, ఫైరింగ్‌, నాకబంది, పిసనర్‌, క్యాష్‌ ఎస్కార్ట్స్‌లు, లాఅండ్‌ఆర్డర్‌ వంటి అం శాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్‌ ఉద్యో గం ఎంతో బాధ్యతాయుతమైనదని మారుతున్న పరిస్థి తుల క్రమంలో పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవడా నికి మోబిలైజేషన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యాజీవితంలో వ్యాయామం, యోగా భాగం చేసుకుంటూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, నిరంతరం విధులలో ఉండే పోలీ సు అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబపరమై న, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని అన్నారు. అయన వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు మధుకర్‌, రమేష్‌, యాదగిరి, ఆర్‌ఎస్‌ఐలు శ్రవణ్‌యాదవ్‌, రమేష్‌, సాయి కిరణ్‌, దిలీప్‌, రాజు, జునైద్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:51 AM