Share News

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:57 AM

అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

పెద్దపల్లి రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి మండలం కాపులపల్లి నుంచి గోపయ్యపల్లి వరకు రూ.కోటితో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను శుక్ర వారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణా రావు మాట్లాడుతూ గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్లు విస్తరణ చేస్తున్నామన్నారు. అంతర్గత రహదారులను అభివృ ద్ధిచేసి ప్రజా రవాణా మరింత మెరుగుపరుస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వానాకాలంలో సన్న వడ్లకు క్వింటాలు కు రూ.500 బోనస్‌ అదనంగా చెల్లించామని తెలిపారు. ఎన్ని కల ముందుఇచ్చిన ప్రతీ హామీని దశలవారీగా అమలు చేస్తు న్నామని గుర్తుచేశారు. రానున్న సంక్రాంతికి రైతులకు ఏడాది కి ఎకరాకు రూ.15వేలు రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పీఆర్‌ ఈఈ గిరీష్‌బాబు, డీఈఈ శంకరయ్య, మా ర్కెట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, వైస్‌చైర్మన్‌ మల్లారెడ్డి, డైరెక్ట ర్లు, విండో ఛైర్మన్లు చింతపండు సంపత్‌, మాదిరెడ్డి నర్సింహ రెడ్డి, నాయకులు ఎడెల్లి శంకర్‌, నూగిల్ల మల్లయ్య, గోపు శ్రీని వాస్‌, మందల సత్యనారాయణ రెడ్డి, కళబోయిన మహేందర్‌, యాంజాని మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:57 AM