Share News

గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:41 AM

రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం
లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న గ్రామస్థులు

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

పెగడపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి, రాజారాంపల్లి, ఏడుమోటలపల్లి తండాలలో ఆదివారం సంత్‌సేవాలాల్‌ జయంతి వేడుకలలో లక్ష్మణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మద్దులపల్లి తండాలో సంత్‌సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించాలని ఆ గ్రామ గిరిజనులు విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల గిరిజన నాయకులతో పాటు మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దావన్‌పల్లిలో భోగ్‌ బండార్‌

రాయికల్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలోని దావన్‌పల్లి గ్రామంలో ఆదివారం సేవాలాల్‌ జయంతి సందర్భంగా భోగ్‌ బండార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సురేందర్‌ నాయక్‌ మాట్లాడుతూ శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ బంజారాల ఐదవ ధర్మ గురువని, బంజారా సంస్కృతి వేధధారణ జీవన విధానాలతో పాటు యావత్‌ బంజారా జాతిని ఏకఽధాటికి తీసుకువచ్చిన మహానీయులని పేర్కొన్నారు. కార్యక్ర మంలో గ్రామ పూజారి బానోత్‌ హంజారియా, కిషన్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ బిక్యా నాయక్‌, గ్రామ సేవాలాల్‌ ట్రస్ట్‌ సభ్యులు బానావత్‌ తిరుపతి నాయక్‌, హపావత్‌ గంగాధర్‌, రాజు, అంబాజీ, తిరుమల్‌, బలరాం, మాజీ సర్పంచ్‌ మల్లయ్య, వెంకటేష్‌, దేవేందర్‌, తిరుపతి, కొమురయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:41 AM