Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:04 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి

కరీంనగర్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఈ నెల 24 వరకు ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటింగ్‌ పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఓటింగ్‌ వివరాలను డీఆర్డీవో, నోడల్‌ అధికారి శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాసరావు, యాదగిరి పాల్గొన్నారు.

ఫ పరీక్షా కేంద్రాల తనిఖీ

కరీంనగర్‌ టౌన్‌: హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తెలంగాణ గిరిజనుల సంక్షేమ డిగ్రీ కళాశాల, మైనార్టీ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను ఆదివారం కలెక్టర్‌ పమేలా సత్పతి పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలల్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలకు గాను నిర్వహించిన ప్రవేశ పరీక్ష నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పవన్‌కుమార్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, అధికారులు లావణ్య, స్వాతి, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 01:04 AM