ప్రజా గాయకుడు గద్దర్‌పై రాజకీయ దాడి
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:54 AM
ప్రజా గాయకుడు గద్దర్‌పై దేశ వ్యాప్తంగా ఒక రాజకీయ దాడి జరుగుతోందని గద్దర్ 77వ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు.

సిరిసిల్ల టౌన్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజా గాయకుడు గద్దర్‌పై దేశ వ్యాప్తంగా ఒక రాజకీయ దాడి జరుగుతోందని గద్దర్ 77వ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్ట ణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గద్దర్‌కు పద్మశ్రీ ఇవ్వడానికి కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనే వార్త దేశ వ్యా ప్తంగా చెక్కర్లు కొడుతోందన్నారు. బీజేపీ భావజాలం గద్దర్ బావాజాలనికి పూర్తిగా బిన్నంగా ఉంటుందని రెండింటి మద్ద వైవిద్యం ఉందన్నారు. గద్దర్ బ్రతికుంటే బీజేపీ ఇచ్చే పద్మశ్రీ అవార్డును తిరస్కరించే వాడన్నారు. దేశంలో 50 కోట్ల మంది గుర్తుంచుకున్న గద్దర్‌కు బీజేపీ ప్రభుత్వం చెడ్డపేరు తీసుకురావాలని చూస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నామ న్నారు. గద్దర్ జీవితం అంతా ప్రజల కోసం, భూమి కోసం భు క్తి కోసం విముక్తి కోసం పని చేశాడన్నారు. గద్దర్ 77వ జ యంతిని విజయవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈనెల 31న సిరిసిల్ల పట్టణం రుచి హోటల్ హాల్‌లో మధ్యాహ్నం గద్దర్ జయంతి వేడుకలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. సమావే శంలో జయంతి ఉత్సవ కమిటీ సభ అధ్యక్షుడు, మాల మహా నాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సీపీఐ జిల్లా కార్య దర్శి గుంటి వేణు, మాజీ ఎంపీటీసీ వంకాయల భూమన్న, మాల మహానాడు జిల్లా మాజీ అధ్యక్షుడు జక్కుల రామచం ద్రం, లక్కం శేఖర్, సిలువేరు శ్రీనివాస్, బాలు పాల్గొన్నారు.