Share News

మంథని పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:52 AM

మంథని పట్టణ సమగ్ర అభి వృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

మంథని పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు..

మంథని, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మంథని పట్టణ సమగ్ర అభి వృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు మంథనిలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ జే. అరుణశ్రీతో కలిసి మంథని పట్ట ణంలో పర్యటించి తెలంగాణ అర్చ న్‌ ఫైనాన్స్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ డెవల ప్మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ. 24 కోట్ల5 లక్షలతో చేపట్టిన పలు అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేశా రు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో పలు అభి వృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నా మన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి న వెంటనే రూ. 30 కోట్లతో రోడ్లు, డ్రైయిన్‌ నిర్మాణం చేపట్టామని తెలి పారు. ఇప్పుడు పురపాలక కార్యాల యం, డంపింగ్‌యార్డ్‌లో సెగ్రిగేషన్‌ షెడ్‌, కంపోస్ట్‌షెడ్‌, ఆఫీసురూమ్‌, సెక్యూరిటి రూమ్‌, టాయిలెట్స్‌, వే యింగ్‌బ్రిడ్జ్‌ పెద్దపల్లి, గొదావరిఖని, కాటారం నుంచి మంథని పట్టణాని కి వచ్చేరోడ్డు ప్రారంభంలో ఆర్చిల ను రూ.9కోట్ల20లక్షలతో చేపట్టా మన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో శ్రీరామ్‌నగర్‌ నుంచి మాత శిశువు హస్పిటల్‌, పోచమ్మ వాడనుంచి గోదావరిఖని క్రాస్‌రోడ్‌, గిట్లరమణారెడ్డి విగ్రహం, కూచిరా జుపల్లి క్రాస్‌రోడ్‌ వద్ద రూ.6కోట్ల71 లక్షలతో సెంట్రల్‌లైటింగ్‌ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. పట్టణంలో స మీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ని ర్మాణం, సీసీరోడ్లు, డ్రైయిన్‌ నిర్మాణ పనులను రూ.8కోట్ల14లక్షలు మం జూరు చేసి పనులు ప్రారంభించా మన్నారు. మొత్తం పట్టణంలో రూ. 24కోట్ల అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశామన్నారు. అనంతరం మంత్రి ఆలింకో సంస్థ నిర్వహించి న క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు ఉపకరణాలను పం పిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, తహసీల్దార్‌ రాజయ్య, ఈఈ సంపత్‌, ఏఈ మౌనిక, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:52 AM