సిరిసిల్ల బ్రాండ్‌తో వస్త్రాల ఉత్పత్తికి ప్రణాళిక
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:40 AM
సిరిసిల్ల బ్రాండ్ తో వస్త్రాలు ఉత్పత్తి చేసే ప్రణాళిక తయారుచేయాలని, డెయిరీ ఉత్పత్తులు, టెక్స్‌టైల్ రంగాల్లో ఎగుమతుల కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా అన్నారు.

సిరిసిల్ల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల బ్రాండ్ తో వస్త్రాలు ఉత్పత్తి చేసే ప్రణాళిక తయారుచేయాలని, డెయిరీ ఉత్పత్తులు, టెక్స్‌టైల్ రంగాల్లో ఎగుమతుల కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఎగుమతులు చేయడానికి వీలుగా అవకాశం ఉన్న రెండు, మూడు ఉత్పత్తులను గుర్తించి, వాటిని ప్రొత్స హించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. నాబార్డ్, ఎంఎస్‌ఎంఈలు జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు తో సమన్వయం చేసుకుంటూ పాల ఉత్పత్తులు, సిరి సిల్ల బ్రాండ్‌తో వస్త్రాల తయారీకి ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో యాక్టివ్‌గా ఉన్నా ఎఫ్‌పీవోలకు ఎక్కువగా మార్కెటింగ్ అందేలా చూడా లని సూచించారు. వస్త్ర పరిశ్రమ నుంచి ఎగుమతులు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికలు అందించాలని అన్నారు. టెక్స్‌టైల్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎంతమేరకు డిమాండ్ ఉంది, ఏలాం టి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతి చేయవచ్చు వంటి వివరా లను పరిశీలించాలని అన్నారు. చేనేత కార్మికులతో సమావేశాలు నిర్వహించడం, శిక్ష ణ అందించాలని పేర్కొన్నారు. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలని అన్నారు. జిల్లాలో ఉన్నా బీఎంసీ పూర్తి స్థాయిలో నడిచేలా చూడాలని దీనికి అవ సరమైన సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. పాడి రైతులతో సంప్రదింపులు జరిపి కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డైరెక్టర్ జనరల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేవీఎస్ శైలజ, టెక్స్‌టైల్ పార్క్ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్, జిల్లా పరి శ్రమల శాఖ అధికారులు పి హన్మంతు, ఎంఏ భారతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, పశు సంవర్థక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, చేనేత జౌళి శాఖ ఏడీ సాగర్, విజయ డెయిరీ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.