ప్రణాళికాబద్ధంగా ‘చేనేత అభయ హస్తం’..
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:47 AM
చేనేత అభయ హస్తం పథకాన్ని ప్రణాళికాబ ద్ధంగా అమలుచేయాలని చేనేత జౌళి, వ్యవ సాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు.

సిరిసిల్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): చేనేత అభయ హస్తం పథకాన్ని ప్రణాళికాబ ద్ధంగా అమలుచేయాలని చేనేత జౌళి, వ్యవ సాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సచివాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్‌తో కలి సి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత అభయహ స్తం పథకం ప్రణాళికాబద్ధంగా, త్వరగా అమలుచేయడానికి నేత కార్మికులకు అవగా హన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ అమలుచేయాలని, యారన్ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చే యాలని ఆదేశించారు. ఆసాములకు నూలు కు అవసరమయ్యే పెట్టుబడిని బ్యాంక్‌ల ద్వారా అందించడానికి చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. ఆసాములు ఇతరుల మీద ఆధారపడ కుండా స్వయంగా నూలు కొను గోలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుం దన్నారు. యారన్ డిపోలో నూలు కొరత లే కుండా చూడాలన్నారు. ఇప్పటివరకు ఏయే శాఖల నుంచి కావాల్సిన వస్త్రఉత్పత్తి ఆర్డర్లు సమర్పించని శాఖలపై చర్యలు తీసుకోవాల న్నారు. చేనేత సహకార సంఘాలు, పవర్ లూం సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం వినియోగదారుల కు మెరుగైన సేవలందించాలని, రైతులకు పవర్‌లూం పరిశ్రమకు నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని సమస్య వస్తే ట్రాన్స్‌ఫార్మర్ మార్చి విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్ రెగ్యులరేటరీ నిబంధన ల ప్రకారం సంస్థను నడపాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వినియోగదారులకు మెరుగైన సేవలందిం చాలని సూచించారు. ఇదే సందర్భంలో కాం గ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పవర్‌లూం, వస్త్ర పరిశ్రమ సెస్ సమస్యలపై మంత్రికి వినతిపత్రం అం దించారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజరామయ్యార్, వ్యవ సాయ కార్యదర్శి రఘునందన్‌రావు, సహకా ర డైరెక్టర్ ఉదయ్‌కుమార్,ఉద్యానవన డైరెక్ట ర్ యాస్మిన్‌భాషా తదితరులు పాల్గొన్నారు.