Share News

కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోయింది

ABN , Publish Date - Feb 19 , 2025 | 01:04 AM

కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలలో విశ్వాసంపోయిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోయింది

సిరిసిల్ల టౌన్‌,ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలలో విశ్వాసంపోయిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆగ య్య మాట్లాడారు. మండుటెండల్లో కాళ్లేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 2022, 2023, 2024లో ఎగువమానే రును నింపితే సిరిసిల్ల మానేరుబ్రిడ్జి వరకు నీళ్ళు వచ్చాయని అన్నారు. వచ్చిన నీళ్ళు ఎక్కడివి ఎవరు కట్టిన ప్రాజెక్టుల నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ బాపు కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టుల నుంచి కాళ్లేశ్వరం ప్రా జెక్టు అనుసందానంగా నిర్మించిన మల్లన్నసాగర్‌, రంగ నాయక సాగర్‌ నుంచి వచ్చాయన్నారు. లక్ష కోట్ల కాళ్లే శ్వరం ప్రాజెక్టుతోపాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలు, లిఫ్ట్‌లు, పంప్‌హాజ్‌లు, రిజర్వాయులు నిర్మాణం చేసి ప్రతి జిల్లాకు కూడా తాగు, సాగు నీరును కేసీఆర్‌ అం దించారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంతోపాటు వేము లవాడ గుడిచెరువును ఎత్తిపోతల పథకం ద్వారా నీరు నింపారన్నారు. కుంగిన పిల్లర్‌ను రేవంత్‌రెడ్డి మరమ్మ తులు చేయకుండా కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారని ఆరోపించారు. ఉరిశాలగా ఉన్న సిరిసిల్లను కేటీఆర్‌ అ భివృద్ధిలో రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలిపాడని అన్నారు. నేతన్నలతో పాటు రైతన్నలకు ఉచితంగా కరెంట్‌ ఇచ్చి రెండు గ్రామాలకో సబ్‌స్టెషన్‌ ఏర్పాటు చేశారన్నారు. మహేందర్‌రెడ్డి ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలవలేద ని కాంగ్రెస్‌ మునిగిపోయే పార్టీ అని విమర్శించారు. కాగా, అభివృద్ధి అంటే అర్థం తెలియిన వారు అభి వృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని గ్రంథాలయం జిల్లా మాజీ చైర్మన్‌ ఆకునూరి శంకర య్య అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిది సంవ త్సరాల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిన సంగతి ఈ ప్రాంత ప్రజలందరికి తెలుసన్నారు. అభి వృద్ధి అంటే ఒక మెడికల్‌ కళశాల, ఇంజనీరింగ్‌ కళా శాల, అగ్రికల్చరల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాలలను కట్టించిన ఘనత కేసీఆర్‌ కేటీఆర్‌దే అన్నారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ గత ఏడాదికాలంగా మొత్తం కుప్పకూలిందని బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సంవత్సరకాలం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు అర్థం అయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకున్న బతకమ్మ చీరల బకాయిలు రూ. 150కోట్లు విడదల చేస్తుందని వ్యాపారులు అనుకున్నా రని ఏ కారణం చేత విడుదల చేయడంలేదో అర్థం కా వడం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌, మాజీ ఎం పీపీలు గజభీంకార్‌ రాజన్న, చంద్రయ్యగౌడ్‌, జిల్లా నా యకులు కుంభాల మల్లారెడ్డి, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 01:05 AM