Share News

సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల ధర్నా

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:05 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్లు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లోని రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ సెల్వాట్కర్‌ తానయ్యకు వినతిపత్రం సమర్పించారు.

సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల ధర్నా
పీఎఫ్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పెన్షనర్లు

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్లు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లోని రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ సెల్వాట్కర్‌ తానయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జనార్దన్‌ మాట్లాడుతూ ఈపీఎస్‌ పెన్షనర్లకు ట్రావెలింగ్‌ కన్సేషన్‌తోపాటు వారి కుటుంబానికి పూర్తిస్థాయిలో మెడికల్‌ రికవరీ సౌకర్యం కల్పించాలన్నారు. అత్యల్ప పెన్షన్‌ పొందుతున్నవారికి రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరారు. ఈపీఎస్‌ పెన్షనర్స్‌ కార్పస్‌ ఫండ్‌ నిధులు ప్రైవేట్‌ పరం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్పస్‌ఫండ్‌పై వచ్చే వడ్డీకి అనుగుణంగా పెన్షన్‌ 5,800 ఇవ్వాల్సి ఉన్నప్పటికి 1,486 రూపాయలు చెల్లించడం సరికాదని, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి ఇరువంటి తిరుమలయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లెల మల్లయ్య, సయ్యద్‌ మునురుద్దీన్‌, నల్ల ప్రభాకర్‌రెడ్డి, నాయ కులు తూముల సురేందర్‌రెడ్డి, కేశిరెడ్డి, రాంచంద్రారెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సింగరావు, ఐ నర్సయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:05 AM