Share News

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:13 AM

జిల్లా ప్రభుత్వ జనర ల్‌ ఆసుపత్రిలో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు.

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

సిరిసిల్ల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభుత్వ జనర ల్‌ ఆసుపత్రిలో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. గురువారం రాజ న్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. పీడీయాట్రిక్‌, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డులు, ఓటీ వెనకవైపు లీకేజీలు, ఎస్‌ఎన్‌ సీయూలో సీలింగ్‌ మరమ్మతులు, సూపరింటెండెంట్‌ చాం బర్‌, పక్క గదుల్లో మరమ్మతులు, ఓపీ గేట్‌ ముందు నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకు ఖాళీస్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌, అత్యవసర రోగులకు మెరుగైన చికిత్సలపై చర్చిం చారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రికి రోగులను తరలింపు కోసం అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌సపోర్ట్‌ అంబులెన్స్‌ ఏర్పాటుపై సమీక్షిం చారు. జనరల్‌ ఆసుపత్రిలో పారిశుధ్యం, ఇతర పనులకు సంబందించిన ఇతర శాఖల అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనా రాయణ, డీఎంహెచ్‌వో రజిత, వేములవాడ సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ పెంచలయ్యలు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:13 AM