జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:36 AM
గ్రామపంచాయితీలల్లో పనిచేస్తున్న కార్మికులకు రావా ల్సిన పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించ డంతోపాటు సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయితీలల్లో పనిచేస్తున్న కార్మికులకు రావా ల్సిన పెండింగ్ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించ డంతోపాటు సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదు ట సీఐటీయూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్వర్యంలో జిల్లాలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులందరితో గురువారం ధర్నా చేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలు మాత్రం గత జూలై నుంచి పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు పెండిం గ్ వేతనాల కోసం నిధులను విడుదల చేసిందని కేవ లం డిసెంబర్ నెల వేతనాలు మాత్రమే కార్మికులకు అందించిందన్నారు. జూలై నుంచి నవంబర్ వరకు వేతనాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. పంచాయతీ కార్యదర్శులను అడిగితే తాము చెక్కులు ఎస్‌టీవోలో వేశామని చెబుతున్నారని అన్నారు. ఎస్‌టీ వోలోని అధికారులను అడిగితే తాము చెక్కులు క్లియర్ చేశాం.. టోకెన్ నంబర్‌లు కూడా ఇచ్చామని.. తమ దగ్గర పెండింగ్‌లో ఏమీ లేవని అధికారులు చెబుతు న్నారని వాపోయారు. మండల పరిషత్ అధికారులను అడిగితే నిధులు లేవని అంటున్నారని అన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ పంచాయతీ అధికారిని అడిగితే జిల్లాలో ఎక్క డ వేతనాలు పెండింగ్‌లో లేవని అంటున్నారని తెలి పారు. కార్మికులకు మాత్రం గత జూలై నుంచి నవం బర్ వరకు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిలాలో కూడా నిధులు పెండింగ్‌లో లేవని ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జన వరి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా మొదటి తేదీన వేత నాలు అందిస్తున్నామని అధికా రులు అంటున్నారని అన్నారు. కలెక్టర్ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వేత నాలను వెంటనే అందించాలని కార్మికుల వేతనాలపై నిర్లక్ష్యం చేస్తున్న పంచాయతీ కార్యద ర్శుల చర్యలు తీసుకొని న్యాయం చేయాలని జిల్లా పంచాయితీ శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందిం చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్‌దాస్ గణేష్, జిల్లా అధ్యక్షుడు మాల్యాల నర్సయ్యతోపాటు నాయకులు బుర్ర శ్రీని వాస్, లోకిని శ్రీనివాస్, నారాపురం నర్సయ్య, అక్కుల అంజయ్యగౌడ్, సందెల మహేష్, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.