పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:07 AM
జిల్లాలో పెండింగ్ రహదారుల భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలె క్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్ రహదారుల భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలె క్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్ లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెండింగ్ రోడ్లు, భవనాల పనుల పురోగతిపై ఆర్‌బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లా లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 12 రోడ్లు, 8 భవనాలు (వైద్య కళాశాలతో సహా), 7 బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు భవనాల శాఖ పరిధిలో పెండింగ్ రహదారి పనులు చేపట్టి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల కు సంబంధించి బిల్లుల చెల్లింపు ఏదైనా తాత్సారం ఉంటే వివరాలు అందించాలని, ప్రభుత్వానికి లేఖ రాసి బిల్లుల చెల్లింపు త్వరగా జరిగే లా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి రోడ్డు నిర్మాణ స్థితిగతుల గురించి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటిని వేగవంతంగా పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల పలు సూచనలు చేశారు. ప్రస్తుత త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటు లోకి వచ్చే రోడ్డు నిర్మాణ పనులు ప్రాధాన్యతతో చేపట్టాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు ఎక్కడ ఇసుక సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రామాణాలుతో చేపట్టాలని అన్నారు. వీర్నపల్లి దగ్గర పాఠశాల సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసు క కేటాయింపులు చేయాలని కలెక్టర్ సంబంధిత తహసిల్దార్‌కు చరవా ణిలో ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కూడా ముగిసిందని అవ సరమైన ప్రతిపాదనలు తయారు చేసి పనులు వెంటనే జరిగేలా చూడాలని తెలిపారు. కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి పనులు క్షేత్రస్థాయి లో త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని అన్నారు. డీఎంఎఫ్‌టీ పరి ధిలో పెండింగ్ ఉన్న బిల్లుల వివరాలను సమర్పించాలని, వెంటనే చెల్లించడం జరుగుతుందని తెలిపారు. రూ 166 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని వీటిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు, అన్నదాన సత్రం, ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముస్తాబాద్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం, కోర్టు భవనాల నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలనితెలి పారు. ఈ సమావేశంలో ఆర్‌బి ఈ.ఈ. వెంకటరమణయ్య, డి. ఈ.లు శాంతయ్య, కిరణ్ కుమార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.