పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:10 AM
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వ ర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేప ట్టారు.

సిరిసిల్ల టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వ ర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేప ట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లా డారు. కార్మికులను పర్మి నెంట్ చేసి వేతనాలు పెంచు తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెర వేర్చడంలేదన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మున్సిపల్ శాఖ బాధ్యత లను నిర్వర్తిస్తూ కార్మికు లను న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికు ల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయ కులు సుల్తాన్ నర్సయ్య, కాసారపు శంకర్, రాజ య్య, బాలయ్య, దేవరాజు, భారతవ్వ, బాబా కిషన్, లక్ష్మి, నర్సవ్వ, మల్లేశం, దేవయ్య, సురేష్, శ్రీనివాస్, నరేష్, రాజు, మమత, పోషవ్వ, శంక ర్ కార్మికులు పాల్గొన్నారు.