Share News

బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన పెద్దపల్లి ఎంపీ

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:06 AM

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లోని జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన పెద్దపల్లి ఎంపీ

గోదావరిఖని, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లోని జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, భోజనశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాష్‌ రూమ్‌ల నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో ప్రభుత్వ హాస్టళ్లలో తమ పిల్లలను చేర్పిస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సొంత పిల్లాల్లా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఫుడ్‌ పాయిజన్‌కు అవకాశం ఇవ్వవద్దన్నారు. పిల్లలు కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలన్నారు. ఈ సందర్భంగా హాస్టల్‌ సిబ్బంది తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Jan 10 , 2025 | 01:06 AM