Peddapalli: నాలాల ఆక్రమణలు తొలగించాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:29 AM
కోల్‌సిటీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, పూడిక తీత చేపట్టాలని అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ జే అరుణశ్రీ ఆదేశించారు. గురువారం వివిధ డివిజన్లలో ఆమె పర్యటించారు.

కార్పొరేషన్ యంత్రాలతో నాలాల పూడిక తీత
నాలాల్లోకి నేరుగా మల వ్యర్థాలు వదిలితే చర్యలు
డివిజన్ల పర్యటనలో కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, పూడిక తీత చేపట్టాలని అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ జే అరుణశ్రీ ఆదేశించారు. గురువారం వివిధ డివిజన్లలో ఆమె పర్యటించారు. 23వ డివిజన్ భీమునిపట్నంలో ఆక్రమణలు తొలగించాలన్నారు. 25వ డివిజన్ టీచర్స్ కాలనీలో పార్కును పరిశీలించారు. పార్కులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. పార్కులో మొక్కల సంరక్షణ, భద్రతకు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. మల వ్యర్థాలు నేరుగా నాలాలకు వదిలితే చర్యలు చేపడుతామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సెఫ్టిక్ ట్యాంకు నిర్మించుకోవాలన్నారు. బస్టాండ్‌లో నైట్ షెల్టర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ వెంట డీసీ వెంకటస్వామి, ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్, డీఈ జమీల్, ఏఈ తేజస్విని, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు ఉన్నారు.