Share News

ముందే పరిషత్‌ ఎన్నికలా..?

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:08 AM

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్‌ పేపర్లతో సహా ఏర్పాట్లు జరిగినా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కంటే పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తారనే చర్చ మొదలైంది.

ముందే పరిషత్‌ ఎన్నికలా..?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్‌ పేపర్లతో సహా ఏర్పాట్లు జరిగినా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కంటే పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తారనే చర్చ మొదలైంది. వేగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లు మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఎన్నికల సామగ్రి కూడా జిల్లాలకు పంపించారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. ఇందుకు అనుగుణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిషత్‌ ఎన్నికల హడావుడి ముందుకు వచ్చింది. ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారుపై చర్చ కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్సీ మహిళ, రెండు ఎస్సీ జనరల్‌, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్‌, మూడు జనరల్‌ మహిళ, మరో మూడు జనరల్‌లకు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆరు మహిళలకు, ఆరు జనరల్‌గా ఉన్నాయి. 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 68 మహిళలకు, 58 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు ఆరు కేటాయించగా, 5 మహిళలకు, ఒకటి జనరల్‌గా ఉంది. 28 ఎస్సీలకు కేటాయించగా, 17 మహిళలకు, 11జనరల్‌, 25 బీసీలకు కేటాయించగా, 14 మహిళలకు, 11 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 64జనరల్‌ స్థానాలు ఉండగా, 29 మహిళలకు, 25 జనరల్‌గా కేటాయించారు. ఈసారి రిజర్వేషన్లు మార్పు ఏలా ఉంటుందనే చర్చ కొనసాగుతోంది. జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కొత్త స్థానాలు పెరగకపోవడంతో పాత తరహాలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిజర్వేషన్లపై 50శాతం మించకూడదనే సుప్రీం కోర్టు నిబంధనలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని, జనరల్‌ స్థానాల్లో ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఇతర పార్టీలు కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆశావహులు మళ్లీ పరిషత్‌ ఎన్నికలపై దృష్టి సారించడంతో పల్లెల్లో సందడి కనిపిస్తోంది.

ఫ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, ముస్తాబాద్‌, రుద్రంగి, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్‌, వేములవాడ అర్బన్‌, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో బోయినపల్లి మండలంలో 11 స్థానాలు, చందుర్తిలో 10, ఇల్లంతకుంటలో 14, గంభీరావుపేటలో 13, కోనరావుపేటలో 12, ముస్తాబాద్‌లో 13, రుద్రంగిలో 5, తంగళ్లపల్లిలో 14, వీర్నపల్లిలో 5, వేములవాడ రూరల్‌లో 7, వేములవాడ అర్బన్‌లో 6, ఎల్లారెడ్డిపేటలో 13 స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది నియామకాలకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 709 పోలింగ్‌ కేంద్రాలు, 3700 మంది పోలింగ్‌ సిబ్బందిని ఇప్పటికే గుర్తించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఈనెల 15లోగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసే దిశగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ పరిషత్‌ ఓటర్లు 3,53,796 మంది..

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లెక్క కూడా తేల్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,53,796 ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి పంపించారు. ఓటర్లలో 1,71,174 మంది పురుషులు, 1,82,602 మంది మహిళలు ఉన్నారు. 20 మంది జెండర్‌లు ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లలో మహిళలే అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 11,428 మంది ఓటర్లు ఉన్నారు.

జడ్పీటీసీ ఎంపీటీసీ ఓటర్లు...

మండలం పురుషులు మహిళలు మొత్తం

బోయినపల్లి 15001 16019 31020

చందుర్తి 13444 14651 28095

ఇల్లంతకుంట 19775 20977 40752

గంభీరావుపేట 17889 19061 36951(జెండర్‌ 1)

కోనరావుపేట 17174 18057 35231

ముస్తాబాద్‌ 18833 19984 38817

రుద్రంగి 6435 7176 13614(జెండర్‌ 3)

తంగళ్లపల్లి 18809 19891 38700

వీర్నపల్లి 5911 6063 11974

వేములవాడ అర్బన్‌ 9099 9623 18738(జెండర్‌ 16)

వేములవాడ రూరల్‌ 9119 9918 19017

ఎల్లారెడ్డిపేట 19705 21182 40887

-----------------------------------------------------------------------------------------------------

మొత్తం 171174 182602 353796(జెండర్‌ 20)

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Feb 12 , 2025 | 01:08 AM