వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:10 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వ స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి జాతరను అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నా మని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

వేములవాడ కల్చరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వ స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి జాతరను అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నా మని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆల యం లోని గుడిచెరువు పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారాన్ని, తిప్పాపూర్ గ్రామంలోని ఆర్టీసీ బస్టాండులో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను ఈవో వినోద్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల దేవుడు వేములవాడ రాజన్న ఆలయానికి జాగరణ కోసం వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలేత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులకు శీఘ్రమైన దర్శనం కలి గేలా క్యూలైన్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారాన్ని వినియోగిం చుకోవాలని సూచించారు. రాజన్న భక్తులకు తిప్పాపూర్ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని, భక్తులు వినియోగించుకోవాల ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారని, తదుపరి తిరుమల, తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు వస్తాయన్నారు. పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని రాజన్న సేవలో తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో వినోద్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.