కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:23 AM
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 25 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం సమ్మె శిబిరంలో పిండి వంటలు తయారు చేసి నిరసన తెలిపారు.

సుభాష్‌నగర్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 25 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం సమ్మె శిబిరంలో పిండి వంటలు తయారు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్‌లైన మినిమమ్ పేస్కేలు, జీవిత బీమా, హెల్త్‌కార్డులు, సమగ్ర శిక్షా మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు రూ. 20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన కుటుంబాలకు రూ. 15లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రకటించి వారి జీవితాలలో వెలుగు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గౌరవా ధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, ప్రధానకార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షులు రమేశ్, రవిచంద్ర, శ్రీనివాస్, భరత్ కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వివిధ స్థాయిల ఉద్యోగులు పాల్గొన్నారు.