Share News

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గంలో నడవాలి

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:48 AM

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గంలో నడవాలి

వేములవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేము లవాడ పట్టణంలోని మల్లారం రహదారిలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ సేవలు చీరస్మరణీయమని కొనియాడారు. గిరి జనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలు ప్రతి ఏడాది నిర్వహించుకోవడం అభినందనీయమ న్నారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్‌ ఈర్యనాయక్‌, కోకన్వీనర్‌ గుగులోతు తిరుపతినాయక్‌, సోమలాల్‌, అగన్‌లాల్‌, మదన్‌లాల్‌, నరేష్‌, ఏఎంసీ చైర్మన్‌ రొండి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:48 AM