ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అధికారులు
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:36 AM
రామగుండం నగరపాలక సంస్థలో ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల ఎంపి కపై జరుగుతున్న సర్వే తీరును గురువారం అదనపు కలెక్టర్, రామ గుండం కమిషనర్ అరుణశ్రీ పరిశీలించారు.

కోల్‌సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల ఎంపి కపై జరుగుతున్న సర్వే తీరును గురువారం అదనపు కలెక్టర్, రామ గుండం కమిషనర్ అరుణశ్రీ పరిశీలించారు. స్థానిక 38వ డివిజన్ ఇందిరానగర్‌లో పర్యటించారు. 21, 22, 23 తేదీల్లో 50 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తా మని, ఈలోపు పథకాల అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, రెవెన్యూ సూపరింటెండెంట్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రావు పాల్గొన్నారు.
ధర్మారం (ఆంధ్రజ్యోతి) : మండలంలో నిర్వహిస్తున్న ఇందిర మ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని డీపీవో వీర బుచ్చయ్య అన్నారు. గురువారం ఆయన మండలంలోని కటికెనపల్లి, మేడారం, ధర్మారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాల సర్వేల విషయంలో పలు సలహాలు, సూచనలు చేశారు. తహసీల్దార్ ఆరీఫోద్దీన్, ఎంపిడీవో ఐనాల ప్రవీణ్ కుమార్, ఎంపీవో కే. రమేష్, కార్యదర్శులు పాల్గొన్నారు.
మంథని (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో జరుగుతున్న నూతన రేషన్‌కార్డుల సర్వేను చైర్‌పర్సన్ పెండ్రి రమ-సురేష్‌రెడ్డి గురువారం పరిశీలించారు. మున్సిపల్ కమీషనర్ ఎన్. మనోహర్ ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాను వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లతో కలిసి పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చైర్‌పర్సన్ పెండ్రి రమ-సురేష్‌రెడ్డి పరిశీలించి అర్హులందరికి కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.