స్థూలకాయంపై అవగాహన ర్యాలీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:09 AM
ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిరిసిల్లలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియ న్ అకాడమి ఆఫ్ పెడి యాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్థూలకా యం (ఉబకాయం) వల్ల వచ్చే వ్యాధులపై అవగా హన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

సిరిసిల్ల టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిరిసిల్లలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియ న్ అకాడమి ఆఫ్ పెడి యాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్థూలకా యం (ఉబకాయం) వల్ల వచ్చే వ్యాధులపై అవగా హన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం జిల్లా ప్రఽభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలో ఇండియన్ మెడికల్ జిల్లా అధ్య క్షుడు శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊబకా యం వల్ల డయాబెటీస్, బీపీ, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రతిరోజు కొంత సమయం వ్యా యామం చేస్తూ సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని అరికట్టవ చ్చని అన్నారు. అనంతరం పట్టణ ప్రధాన రహదా రుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏపీ అధ్యక్షుడు డాక్ట ర్ మధు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ అభినయ్, ఐఏపీ కార్యదర్శి డాక్టర్ సాయి. ఉమెన్స్‌వింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ లీలాశిరిషా, డాక్టర్ శోభా రాణి, డాక్టర్ అరుణ,మెడికల్ కళాశాల విద్యా ర్థులు పాల్గొన్నారు.