Share News

డీఈఈటీ యాప్‌లో విద్యార్థుల పేర్లు నమెదు చేయాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:49 AM

తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజ్‌ యాప్‌లో విద్యార్థుల పేర్లను 15రోజుల్లోగా నమోదు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.

డీఈఈటీ యాప్‌లో విద్యార్థుల పేర్లు నమెదు చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజ్‌ యాప్‌లో విద్యార్థుల పేర్లను 15రోజుల్లోగా నమోదు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో శుక్రవారం తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజ్‌ యాప్‌లో విద్యార్థుల పేర్ల నమోదు పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ డిజి టల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్చేంజ్‌(డీఈఈటీ) యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. నిరుద్యోగులకు, పరిశ్రమలకు వారధిగా ఇది పని చేస్తుందన్నారు. ఐటీఐ, పాలిటె క్నిక్‌, డీగ్రీ, ఇంజనీ రింగ్‌, ఫార్మసీ, ఇతర ఉపాధి కోర్సులు చదివిన విద్యార్థులు డీఈఈటీ లో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి పోందే అవకాశాలు మెరుగు అవుతాయన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఐటీఐ కళాశాలు, ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో పాసైన విద్యార్థుల వివరా లను 15రోజుల్లో డీఈఈటీలో నమోదు అయ్యేలా చూడాలన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో, ఎంబీఏ, కాలేజీ విద్యార్థులు కూడా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాల న్నారు. ప్రైవేటు రంగంలోనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్‌లో అర్హత కలిగిన ఉద్యోగాల వివరాలు కూడా విద్యార్థులకు చేరవేసేందు కు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సమా వేశంలో పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, ఏడీ భారతి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌, సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:49 AM