Share News

సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో నిలపాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:46 AM

భారత దేశం లోనే సభ్యత నమోదులో తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉందని కాంగ్రెస్‌ పార్టీ మహిళ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు, జిల్లా ఇన్‌చార్జి కృష్ణ వేణి అన్నారు.

సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో నిలపాలి

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : భారత దేశం లోనే సభ్యత నమోదులో తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉందని కాంగ్రెస్‌ పార్టీ మహిళ రాష్ట్ర ఉపాధ్య క్షురాలు, జిల్లా ఇన్‌చార్జి కృష్ణ వేణి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ మహిళ జిల్లా అధ్య క్షురాలు కాముని వనిత అధ్య క్షతన జరిగిన సభ్యత్వ నమో దు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి కృష్ణవేణి మాట్లాడుతూ మహిళ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు అల్క లంబా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతరావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం సభ్యత్వ నమోదుపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత నమోదులో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. సెప్టెంబర్‌ 15 మహిళా కాంగ్రెస్‌ ఆవిర్భవ దినోత్సవం రోజు నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మహిళ నాయకురాలు విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వారికి అర్థమెన విధం గా వివరించాలన్నారు. రానున్న ఎన్నికలలో మహిళలు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కృషి చేయాల ని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, మాజీ కౌన్సిలర్‌ మడుపు శ్రీదేవి, నాయకు రాలు గొట్టె రుక్మిణి, సత్య లక్ష్మి, హారిక, లత, సత్యప్రసన్న, రాజ్యలక్ష్మి, లహరి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:46 AM