Share News

మున్సిపల్‌ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:49 AM

మున్సిపాలి టీల్లో ప్రతి ఒక్క అధికారి తన విధులను పకడ్బందీగా నిర్వహించాలని, సిబ్బందికి అనుమతి లేకుండా సెల వులు మంజూరు చేయ వద్దని కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

మున్సిపల్‌ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

సిరిసిల్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలి టీల్లో ప్రతి ఒక్క అధికారి తన విధులను పకడ్బందీగా నిర్వహించాలని, సిబ్బందికి అనుమతి లేకుండా సెల వులు మంజూరు చేయ వద్దని కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సిరిసిల్ల మున్సిపల్‌ పని తీరుపై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధి కారుల వివరాలు నిర్వహిస్తున్న విదులను తెలుసుకు న్నారు. పారిశుద్ధ్య నిర్వహాణ, ఇంటింటి నుంచి చెత్త సేక రణ, చెత్తబుట్టల పంపిణీ, వాహానాల వివరాలు, వర్కింగ్‌, నాన్‌వర్కింగ్‌ ట్రేడ్‌ లైసెన్సులు, బిల్డింగ్‌ అనుమతులు, ఆస్తి పన్నులు, వాటర్‌ ట్యాంక్‌, వర్మీ కంపోస్ట్‌ ఎస్టీపీ ట్యాంక్‌ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ప్రతి రోజు ఉదయం పారిశుధ్య సిబ్బంది హాజరు పక్కాగా నమోదు చేయాలని ప్రతిరోజు చెత్త సేకరణ పకడ్బందీగా చేయాలని అన్నారు. మున్సి పల్‌ వాహనాలకు ప్రభుత్వ పెట్రోల్‌ బంక్‌లో మాత్రమే డీజిల్‌ వాడాలని తెలిపారు. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్‌ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వాహనాల మూవ్‌మెం ట్‌ను చూడాలని అన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌లు, రెన్యూవల్‌ వసూళ్ల ఫీజు ఫునఃపరిశీలించాలని, ప్రతి వ్యాపారి నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయాలని అదేశించారు. లక్ష్యం మేరకు వంద శాతం అస్థిపన్ను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని అన్నారు. భవన నిర్మాణాల అనుమ తులు, లే అవుట్‌ అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయాలని అన్నారు. పట్టణంలో మొక్కలపెంపకం, తాగు నీటి సరఫరా గురించి తెలుసుకున్నారు. పిచ్చి మొక్కలను బ్లేడ్‌యంత్రాలతో తొలగిస్తూ శుభ్రం చేయాలని అన్నారు. మున్సిపాటీల్లో టీయూ ఎఫ్‌ఐడీసీ ద్వారా చేపట్టిన అభి వృద్ధి పనుల స్థితిగతులు తెలుసుకోవాలని, ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని అన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని నిర్మాణాలకు ఆస్కారం ఇవ్వవద్దని అన్నారు. చెరువులు అక్రమణకు గురికాకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్య, ఇతర మున్సిపల్‌ అధికా రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:49 AM