ప్రతీ మహిళకు మెప్మాలో సభ్యత్వం
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:08 AM
పట్టణాల్లో మహిళా సంఘాంలో చేరని మహిళలకు కొత్తగా సభ్యత్వం కల్పించడా నికి మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలణ సంస్థ) చర్యలు తీసుకుంటుంది.

కొత్త వారికి సంఘాల్లో చోటుకు కసరత్తులు
సర్వే నిర్వహించి...నమోదు చేయడంపై దృష్టి
ఈనెలాఖరు వరకు కాలనీల్లో ప్రత్యేక డ్రైవ్
ఫిబ్రవరి తొలి వారంలో సమావేశాలు, గ్రూపుల విభజన
ఇందిరా మహిళా శక్తి పథకంలో రుణాలు, బీమా ప్రయోజనాలు
- జిల్లాలో ఇప్పటికే 5,361 మెప్మా మహిళా సంఘాలు..58,076 మంది సభ్యులు
జగిత్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో మహిళా సంఘాంలో చేరని మహిళలకు కొత్తగా సభ్యత్వం కల్పించడా నికి మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలణ సంస్థ) చర్యలు తీసుకుంటుంది. మున్సిపాలిటీల్లో నివాసం ఉంటున్న ప్రతీ మహిళకు సభ్యత్వం కల్పించేందుకు ఇటీవల రాష్ట్ర మెప్మా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయకల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ అయిదు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో స్వయం సహాయక మహి ళా సంఘాలు ఉండగా వేల సంఖ్యలో సభ్యులు ఉన్నారు. వీరితో పాటు కొత్తగా మహిళలను సంఘంలో చేరుకోవాలని ఆదేశాలు వచ్చాయి.
సర్వే నిర్వహించి...నమోదు చేయడంపై దృష్టి..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెప్మా రిసోర్స్ పర్సన్‌లు, సీఓ లు జనవరి చివరి వారం వరకు కొత్త వారికోసం సర్వే నిర్వ హించి వారి వివరాలు ఇంటర్‌నెట్ ఆన్‌లైన్‌లో నమోదు చే యనున్నారు. కాగా ఫిబ్రవరి మొదటి వారంలో వారితో సమావేశాలు నిర్వహించి మహిళా సంఘాలను గ్రూపులుగా విభజించనున్నారు.
వారికి తోడు ఇదివరకు సంఘంలో ఉండి వెళ్లిపోయిన వారిని కూడా గుర్తించి అవగాహన పర్చడంపై ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘంలో సభ్యత్వం ఇచ్చిన తర్వా త రాష్ట్ర పభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళాశక్తి పథకంలో రుణాలు ఇప్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాఖ ఆదే శాల మేరకు చర్యలు తీసుకుంటామని మెప్మా అధికారులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 789 మ హిళా సంఘాలకు రూ. 74.10 కోట్లు రుణాలు ఇవ్వాలన్న ల క్ష్యానికి గానూ ఇప్పటివరకు 493 సంఘాలకు రూ. 59.99 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. మిగిలిన లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు సాధించడంపై అధికారులు దృష్టి సారించారు.
ఇవీ ప్రయోజనాలు..
ఫ 18 ఏళ్లు నిండి పట్టణంలోని తెల్లరేషన్ కార్డు దారులు సంఘంలో అర్హులు. సంఘంలో చేరిన మహిళలు రుణాలు పొంది వ్యాపారంలో రాణించవచ్చు.
ఫ సంఘంలో రుణం పొంది ప్రమాదవశాత్తు మృతి చెం దితే రూ. 10 లక్షలు, సాధారణ మరణమైతే రూ. 2లక్షల వరకు భీమా ఉంటుంది.
ఫ సంఘంలో చేరిన తర్వాత వ్యక్తిగతంగా రూ. 3.50 లక్షలు రుణం పొందేందుకు అర్హులు.
ఫ మెప్మా మహిళా సంఘాల సభ్యులకు వర్తించే అన్ని ప్రయోజనాలు పొందే వీలుంది.
ఫ రుణాలు పొందడం, వ్యాపార నిర్వహణపై అధికారులు శిక్షణ ఇస్తారు.
అర్హులైన మహిళలు సంఘాల్లో చేరాలి
- శ్రీనివాస్ గౌడ్, మెప్మా పరిపాలన అధికారి
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అర్హులైన మహిళలు స్వ యం సహాయక సంఘాల్లో చేరాలి. పట్టణాల్లో నివాసముంటున్న ప్రతీ మహిళకు సంఘంలో సభ్యత్వం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కాలనీల్లో సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తున్నాము. సంఘాల్లో సభ్య త్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహణ కల్పించి చేరేలా ప్రోత్సహిస్తున్నాము. మున్సిపాలిటీల్లో అవస రమైన ప్రాంతాల్లో మరిన్ని కొత్త సంఘాలను ఏర్పాటు చేయనున్నాము.
జిల్లాలోని మహిళా సంఘాల వివరాలు ..
మున్సిపాలిటీ పేరు... సంఘాల సంఖ్య...సభ్యులు సంఖ్య
1. జగిత్యాల............... 2,284..............24,149
2. కోరుట్ల................... 1,382..............14,896
3. మెట్‌పల్లి.................1,134................12,743
4. రాయికల్...............288....................3,254
5 ధర్మపురి..................273....................3,034
మొత్తం.......................5,361.................58,076