బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందేలా చర్యలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:58 AM
బ్యాంకిం గ్ సేవలు జిల్లాలోని ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ శ్రీహర్ష బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
- పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): బ్యాంకిం గ్ సేవలు జిల్లాలోని ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ శ్రీహర్ష బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డిసెంబరు 31 నాటికి క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 102 శాతం ఉందని, జిల్లాలో ప్రతీ బ్యాంకు డిపాజిట్లను పెం చేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. జిల్లాలోని రైతులకు పంట రుణాల కింద 1,864 కోట్ల రూపాయలు ఇవాల్సి ఉండగా, డిసెంబరు చివరి నాటికి 1037 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,164 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా, రూ. 650 కోట్ల రుణాలు ప్రతీ బ్యాంకు బ్రాంచీ నుంచి కనీసం ఐదు వ్యాపార యూనిట్ల గ్రౌండిం గ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన యువత కు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదే శించారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 27 నాటికి 4,559 స్వశక్తి సంఘాలకు 386 కోట్ల 99 లక్షలు, మెప్మా కింద 411 సంఘా లకు 49 కోట్ల34లక్షల బ్యాంకు రుణాలు అందిం చామని అధికారులు తెలిపారు. స్వశక్తి సంఘా లకు నిర్ధేశించుకున్న లక్ష్యంలో 80 శాతం మాత్రమే పూర్తి కావడానికి గల కారణాలను కలెక్టర్ ఆరాతీశారు. స్వయం ఉపాధిని ప్రోత్స హించేందుకు వివిధ పథకాల కింద యువతకు రుణాలు అందించాలని, స్టాండ్ ఆఫ్ ఇండియా కింద డిసెంబరు చివరి నాటికి 20 యూనిట్లకు 3 కోట్ల 62 లక్షల, ముద్రా రుణాల కింద 20 వేల 417 మంది లబ్ధిదారులకు 156 కోట్ల 94 లక్షల రుణాలు అందించామని తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద ప్రస్తుత సంవత్సరంలో మూడు కోట్ల 32 లక్షల విలువగల 64 యూనిట్లను గ్రౌండ్ చేశామన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో 45 మరి అర్హులకు 91 లక్షల రుణం పంపిణీ చేశామని, మత్స్య శాఖ ద్వారా 81 మందికి 2 కోట్ల 54 లక్షల రుణ పంపిణీ జరిగిందని అన్నారు. అనంతరం కలెక్టర్ 2025-26 సంవత్సరానికి సం బంధించి వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు. సమావేశం లో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
విద్యాప్రమాణాలు పెంచడంపై శ్రద్ధ వహించాలి
పెద్దపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచడంపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు శ్రద్ధ వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత కలెక్టరేట్‌లో 36కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో, 14మండలాల ఎంఈవోలు, పెద్దపల్లి, ఓదెల మండలం ప్రాథమిక, ప్రాథమికోన్నత హెడ్ మాస్టర్లతో ఎఫ్‌ఎల్‌ఎన్ మిడ్‌లైన్ టెస్ట్ ఫలితాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల సమర్థ నిర్వహణ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పటిష్ఠ పర్యవేక్షణతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌లలో రాసి, చదివే సామర్థ్యాలను పెంచాలని, గణితంలో కనీస సామర్థ్యం ఉండేలా దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విధ్యాశాఖ అధికారి డి మాధవి, జిలా సమగ్రశిక్ష సమన్వయకర్త పీఎం షేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.