Share News

‘స్థానిక’ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు..

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:46 AM

స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.

‘స్థానిక’ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు..

వేములవాడ టౌన్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ అర్బన్‌ మండల పరి ధిలోని అన్ని గ్రామాల ముఖ్య ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అబద్ధాలు చెప్పి మరిం త బలహీనపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెబుతారని, ప్రతి కార్యకర్త తన బలమేంటో చూపించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గడచిన కాలంలో ప్రజలకు అబద్ధాలు చెప్పి చెప్పి చివరికి చేసింది ఏం లేదని, ముఖ్యంగా రైతు భరోసా ఇస్తామని నమ్మబలికి తీరా సమయానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఏడది కాలం పూర్తి చేసిందని, మరో ఏడాది కాలానికి ఏం చెప్పాలో ఆలోచనలో పడిందన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేసే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యకర్తకు తన వంతు సహాయసహకారం అందిస్తానన్నారు. ఈ సమావేశంలో సెస్‌ డైరెక్టర్‌ హరిచరణ్‌రావు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, సీనియర్‌ నాయకులు బూర బాబు, ఆర్‌సి రావు, తాజా మాజీ సర్పంచులు రేగు లపాటి రాణి, స్వయంప్రభ, వెంకటరమణారావు, రాసురి రాజేశం, జిల్లా కోఆర్డి నేటర్‌ వనపట్ల సందీప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:46 AM