రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్..
ABN , Publish Date - Mar 06 , 2025 | 01:01 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ అంటేనే కాలేశ్వరం అని అంటూ కేటీఆర్ రైతులను మభ్య పెడుతూ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ అలానే ఉంటే సిరిసిల్ల పరిధిలోని గి రిజన తండాకు సాగునీరు అందించే వాడని కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నాడని అన్నారు. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ ఒక్క గుంటకు కూడా నీరు అందించలేదన్నారు. వేసవిలో నీరు అందించి రైతుల ను ఆదుకోవాలని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తంకు మార్‌రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులతో మాట్లాడి గిరిజన తండా గుట్టల వరకు కాలువ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్కపేట రిజర్వాయర్‌కు బాకాయి పెట్టిన 11 కోట్ల డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చాడన్నారు. రైతులకు ఎల్లంపల్లి ద్వారా నీరందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి మా ర్కెట్ కమిటీ చైర్మన్ కచకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా తోపాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.