Share News

పదవి కోసం కేటీఆర్‌ను నిందిస్తున్న కేకే

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:10 AM

కాంగ్రెస్‌ పార్టీలో మంచి పదవులు రావడం కోసమే కేకే మహేంద ర్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ను నిందిస్తున్నాడని బీఆర్‌ఎస్‌ నాయ కుడు, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవి కోసం కేటీఆర్‌ను నిందిస్తున్న కేకే

తంగళ్లపల్లి (సిరిసిల్ల రూరల్‌) మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీలో మంచి పదవులు రావడం కోసమే కేకే మహేంద ర్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ను నిందిస్తున్నాడని బీఆర్‌ఎస్‌ నాయ కుడు, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువా రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ సిరిసిల్ల ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కట్టలేదని, అభివృద్ధి చేయలేదని కేకే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లా లో మిడ్‌మానేరు, మల్కపేట,అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లను ఎవరు కట్టిం చారో తెలియని స్థితిలో ఉన్నారన్నారు. సిరిసిల్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేటీఆర్‌ను ఏకవచనంతో విమర్శిస్తే ప్రతిఘటిస్తా మన్నారు. ఈ సమావేశంలో తాజా మాజీ ఎంపీపీ పడిగెల మానసరాజు, మాజీ సర్పంచ్‌ కోయ్యాడ రమేష్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, నాయకులు బండి జగన్‌, అమరేందర్‌రావు, గుంటి ప్రేమ్‌కుమార్‌, కురుమ రాజయ్య, కందుకూరి రామాగౌడ్‌, కరుణాకార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:10 AM