Karimnagar: ఎండుతున్న పొలాలు
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:24 AM
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మండలంలోని పలుగ్రామాల్లో పచ్చని పొలాలు నీరులేక నెర్రెలు వారుతున్నాయి.
- అడుగంటిన భూగర్భ జలాలు
- ఎడారిని తలపిస్తున్న వాగులు
- జీవాలకు మేతగా వరిపొలాలు
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మండలంలోని పలుగ్రామాల్లో పచ్చని పొలాలు నీరులేక నెర్రెలు వారుతున్నాయి. యాసంగికి ఎంతో సంతోషంగా రైతులు వరి, మొక్కజొన్న పంట లను సాగుచేశారు. కానీ వేసవికాలం కూడా రానే లేదు.. అప్పుడేపొలాలు బీటలు వారుతున్నాయి. సాగు నీరు అందక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటిపోయి బావులు బోరుమం టున్నాయని సాగు నీరందించాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు. కరీంనగర్ రూరల్ మండ లంలోని మోతె, ఇరుకుళ్ల, మానేరు వాగుల్లో నీరులేక పోవడంతో పొలాలకునీరు అందడం లేదు. వాగుల్లోని వ్యవసాయ బావులు అడుగంటి పోతున్నాయి. ఎల్లంపల్లి, లోయర్ మానేరుడ్యాం, కొత్తపల్లి చెరువు, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయడం లేదు. దీంతో పొలాలు ఎండిపోగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ మండలం లోని ఇరుకుల్ల, మొగ్దుంపూర్, నగునూర్, ఎలబో తారం, గోపాల్‌పూర్, దుర్శేడ్, నల్లగుంటపల్లి, మందుల పల్లి గ్రామాల్లో సాగునీరుకు తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొట్ట దశకు చేరిన సమయంలో నీటి విడుదల లేకపోవడంతో పొలాలు ఎండిపోతు న్నాని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎస్సారెస్పీ నీరు కూడా సరిగా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతె, ఇరుకుల్ల, మానేరు వాగు పూర్తిఎడారిగా మారడంతో పక్క నే బోరుబావుల్లో కూడా నీరులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు వురు రైతులకు చెందిన దాదాపు 100ఎకరాలకు పైబడి పంటలు ఎండిపోయాయి. వరి, మొక్క జొన్నపంటలు నీరందక ఎండిపో తున్నాయి. వెంటనే మోతె వాగు లోకి నీరు విడుదలచేస్తే ఇరు కుల్ల, మానేరువాగు నీరుచేరి భూ గర్బజలాలు పెరగ డంతోపాటు బావుల్లో నీటిమట్టం పెరిగి పం టలను రక్షించుకోవ చ్చని లేకుంటే పూరి ్తగా రైతులు నష్టపో యే ప్రమాదం ఉంద ని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి సాగునీటి సమస్యలు తీర్చాలని ఆయాగ్రామాల రైతులు కోరుతున్నారు.
రామడుగు: ఓవైపు మండలంలో వరద కాలువ.. గ్రావిటికెనాల్.. మరోవైపు ఎల్లంపల్లి పైపులైన్ ఉన్నప్ప టికీ పంటలకు చుక్కనీరు అందడంలేదు. మండలం లోని షానగర్, కోరటపల్లి, మోతె గ్రామాల్లో సాగు నీరు అందక 200ఎకరాల్లో పొట్ట దశకు చేరుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితిఏర్పడింది. మరో రెండు మూడు రోజులు పరిస్థితిఇలాగే కొనసాగితే పెద్దసం ఖ్యలో పంటలు ఎండిపోయేపరిస్థితి ఏర్పడు తుందని రైతులుగగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి యుద్ధప్రతిపాదికన ఎల్లంపల్లి పైపులైన్ ద్వారా రిజర్వాయర్‌లోనికి నీటిని వదిలి అక్కడనుంచి నేరుగా మోతేవాగుకు నీటిని అందిస్తే తప్ప పంటలు తడిసే అవకాశంలేకుండా పోతుందని రైతులు ఆవే ధన వ్యక్తం చేస్తున్నారు.
గొర్రెలకు మేతగా మారిన వరి పంట..
సిరిసిల్ల రూరల్: సిరిసిల్లలో నీళ్లులేక ఎండిపోయిన వరిపంటలు గొర్రెలకు మేతగా మారిపోతున్నాయి. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని కాలువల్లోకి వదలకపోవడంతో సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ గ్రామంలోని వ్యవసాయ బావుల్లో నీరులేక వరి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పశువులు, గొర్రెలకు మేతగా వదిలేశారు. పెద్దూర్ గ్రామ శివారులోని ఎద్దుగుట్ట ప్రాంతంలో ఉన్న కాసారం నర్సయ్యకు చెందిన రెండు ఎకరాలను గ్రామానికి చెందిన సలేంద్రి మల్లయ్య అనే రైతు కౌలు తీసుకుని వరి పంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేకపోవడంతో గొర్రెలకు మేతగా వదిలేశారు. గ్రామానికి చెందిన తమ్మెట జీవన్‌కు చెందిన రెండు ఎకరాలు, సలేంద్రి మల్లయ్యకు చెందిన మూడు ఎకరాలు, గుర్రం నర్సయ్యకు చెందిన రెండు ఎకరాలు సైతం గొర్రెలకు మేతగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మల్కపేట రిజ్వాయర్ నుంచి నీటిని చెరువుల్లోకి నింపి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.