Share News

Karimnagar: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:50 PM

కరీంనగర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

Karimnagar: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

- ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్‌ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఽఉన్నతపాఠశాల (ధన్గర్‌వాడీ), గంగాధర మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈనెల 27న జరిగే ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ సంఖ్యను ఓటర్లకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూడాలని, దివ్యాంగ ఓటర్ల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి ఓటరు స్వేచ్చగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్దార్లు నరేందర్‌, అనుపమ, ఎంపీడీవో రాము, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:51 PM