Share News

Karimnagar: డంపింగ్‌ యార్డుకు చెత్తను తరలించొద్దు

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:53 PM

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నగరంలోని చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు.

 Karimnagar:  డంపింగ్‌ యార్డుకు చెత్తను తరలించొద్దు

- మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నగరంలోని చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. శనివారం ఆమె నగరంలోని 7,31 డివిజన్లలో పర్యటించి, పారిశుధ్య పనులను తనిఖీ చేసి స్థానికులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఆ రెండు డివిజన్లకు చెందిన వార్డు ఆఫీసర్లు, జవాన్లు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, పారిశుధ్య జవాన్లు, సమైక్య సంఘాల లీడర్లు, ఆర్పీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాలిడ్‌, ప్లాస్టిక్‌ మేనేజిమెంట్‌ ప్రక్రియలో భాగంగా రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌ పద్ధతిలో తడి, పొడిచెత్త, హాజర్డర్‌ వేస్టు సెగ్రిగేషన్‌పై పలు సూచలను చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ ప్రక్రియతో రెండు డివిజన్లలో ఉత్పత్తి అయిన చెత్తను రిసోర్సు పార్కులోని ట్రిపుల్‌ ఆర్‌ సెంటర్‌కు తరలించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛ ఆటోల కార్మికులు తడి పొడిచెత్తతో పాటు ఇతర వ్యవర్థాలను వేరు చేసి తరలించాలని ఆదేశించారు. మంగళవారం, శుక్రవారం రెండు రోజులు పొడిచెత్తను ఇళ్ల నుంచి సేకరించి ట్రిపుల్‌ ఆర్‌ సెంటర్‌కు తరలించాలన్నారు. ప్రతి రోజు వార్డు ఆఫీసర్లు, జవాన్లు తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమైక్య సంఘాల లీడర్లు, ఆర్పీలు ఈ అంశాన్ని ప్రత్యేక ఏజెండాగా చేర్చుకొని మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి నుంచి వేరు చేసిన తడిచెత్తను వర్మీకంపోస్టు తయారీకి వినియోగించుకోవాలని సూచించారు.

ఫ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి

వేసవిలో నగర ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె 31వ డివిజన్‌లో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. నల్లానీరు తక్కువ వస్తున్నాయని మహిళలు తెలుపడంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పైపులైను మరమ్మతులు చేపట్టాలని, లీకేజీలను అరికట్టాలని సూచించారు. డివిజన్‌లో అక్రమంగా భవన నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా టౌన్‌ప్లానింగ్‌ అధికారులను వెంటనే పిలిపించి, డాక్యుమెంట్లను పరిశీలిం చాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:53 PM