Share News

Karimnagar: యూజీసీ నూతన ప్రతిపాదనలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:55 PM

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): యూజీసీ నూతన ప్రతిపాదనలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు.

Karimnagar: యూజీసీ నూతన ప్రతిపాదనలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): యూజీసీ నూతన ప్రతిపాదనలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. శనివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తే ప్రత్యక్ష దాడులు చేస్తామని హెచ్చరించారు. యూజీసీ నూతన ప్రతిపాదనలు యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తు యూనివర్సిటీల ప్రతిపత్తిని దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి బీజేపియేతర ముఖ్యమంత్రులను ఏకం చేసి ఉద్యమించాలన్నారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్‌, నగర నాయకులు సందీప్‌రెడ్డి, అరవింద్‌, మచ్చ పవన్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:55 PM