Karimnagar: వైభవంగా చక్రస్నానం
ABN , Publish Date - Feb 13 , 2025 | 10:37 PM
శంకరపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి పౌర్ణమి జాతరలో భాగంగా గురువారం స్వామవారి పుష్కరిణిలో ఉత్సమూర్తులకు చక్రస్నానం నిర్వహించారు.

శంకరపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి పౌర్ణమి జాతరలో భాగంగా గురువారం స్వామవారి పుష్కరిణిలో ఉత్సమూర్తులకు చక్రస్నానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. సుప్రభాతం, నిత్యారాధన, బాల భోగం, శేష హోమం, మహా పూర్ణహుతి, బలిహరణం కార్యక్రమాలనునిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేశారు. చక్రస్నానం అనంతరం ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దోష నివారణ కోసం నాకబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, ఈవో సుధాకర్, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.