Karimnagar: బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రశ్నించే గొంతుకలు కావాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:14 AM
హుజూరాబాద్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ ఎస్ కార్యకర్తలు ప్రశ్నించే గొంతుకలు కావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.
హుజూరాబాద్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ ఎస్ కార్యకర్తలు ప్రశ్నించే గొంతుకలు కావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇల్లందకుంట మండల బీఆర్‌ఎస్ కార్యకర్త లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరుహామీలపై కాంగ్రెస్ నాయకులను బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలన్నారు. జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 10వతేదీ వరకు అన్నిగ్రామాల్లో బీఆర్‌ఎస్ కమిటీలు వేస్తామన్నారు.