జూనియర్ కళాశాల ల్యాబ్ గదులకు మరమ్మతులు చేపట్టాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:51 AM
సిరిసిల్ల ప్రభుత్వం జూనియర్ కళాశాలలో శిథిలావస్థకు చేరిన ల్యాబ్ గదులకు మరమ్మతు చేయాలని లేకుం టే మరో గదుల్లోకి మార్చాలని బీఅర్ ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర నాయకు లు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల రూరల్,ఫిబ్రవరి 11 (ఆంధ్ర జ్యోతి): సిరిసిల్ల ప్రభుత్వం జూనియర్ కళాశాలలో శిథిలావస్థకు చేరిన ల్యాబ్ గదులకు మరమ్మతు చేయాలని లేకుం టే మరో గదుల్లోకి మార్చాలని బీఅర్ ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర నాయకు లు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో డీఐఈవో కార్యాల యంలో మంగళవారం డీఐఈవోకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సంద ర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ పట్ట ణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1969లో ఏర్పాటు చేసిన ల్యాబ్ గదులల్లో ఇంటర్మీడి యెట్ చదు వుతున్న విద్యార్థుల కోసం ల్యాబ్‌లను ఏర్పా టుచేశారు. గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపో తాయోనని విద్యార్థులు భయంతోనే ల్యాబ్ ప్రాక్టికల్స్ చేస్తున్నారన్నారు. కళాశాలలో సరైన గదులు లేకపోవ డంతో విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడు తున్నారన్నారు. ల్యాబ్‌లను మరో గదుల్లో మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్‌గౌడ్, సామల శ్రీకాంత్, మట్టి తిరుపతి, సంపత్, లక్ష్మణ్, నితి న్, రవి, హరీష్, సంతోష్, అజయ్, రాజశేఖర్ తదిత రులు పాల్గొన్నారు.