Share News

jagityaala : ఇక సులువుగా సెంటర్‌కు

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:08 AM

జగిత్యాల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా బోర్డు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.

jagityaala :  ఇక సులువుగా సెంటర్‌కు

-తొలిసారిగా ఇంటర్‌ హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌, టోల్‌ఫ్రీ నంబర్లు

-పరీక్ష కేంద్రం అడ్రస్‌, దూరం, ఇతర వివరాలు నిక్షిప్తం

-విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు

-ఈనెల 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు

జగిత్యాల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా బోర్డు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. పరీక్ష కేంద్రం అడ్రస్‌ తెలియకపోయినా ఇబ్బంది పడకుండా పలు చర్యలు చేపట్టింది. సందేహాలు తీర్చేందుకు ఇంటర్‌ బోర్డు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన హాల్‌టికెట్లు జారీ చేస్తోంది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే పరీక్ష కేంద్రం అడ్రస్‌, విద్యార్థి ఉన్న ప్రాంతం నుంచి సెంటర్‌ ఎంత దూరం ఉంది.. ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో తెలిసిపోయేలా ఏర్పాటు చేస్తోంది.

ఫపలు సంస్కరణలకు శ్రీకారం

విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు ఈ విద్యా సంవత్సరం తొలిసారిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గత నెల 22వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను మొదటిసారిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించింది. తాజాగా ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల కోసం నూతన విధానం అమలు చేస్తోంది. హాల్‌టికెన్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యార్థుల సెల్‌నంబర్లకు మెసేజ్‌లు పంపింది. పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌, పరీక్షలకు సంబంధించిన సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు హాల్‌టికెట్‌పై టోల్‌ ఫ్రీ, కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. నూతన విధానం వల్ల విద్యార్థులకు పరీక్ష కేంద్రాల అడ్రస్‌, హాల్‌టికెట్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తవు.

ఫక్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే అడ్రస్‌

హాల్‌ టికెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే రూట్‌మ్యాప్‌ ఆధారంగా సులువుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా గత కొన్నేళ్లుగా హాల్‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఇంటర్‌ బోర్డు కల్పించింది. కానీ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానంపై సరియైున అవగాహన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇకనుంచి ఆ సమస్య లేకుండా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ అయ్యే తేదీ, హాల్‌టికెట్‌ నంబర్లు విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో వస్తున్నాయి. దీంతో విద్యార్థులు సులువుగా హాల్‌టికెట్‌ పొందే అవకాశం ఏర్పడింది. నూతన విధానం ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు వర్తించనుంది.

పరీక్ష కేంద్రం వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు

-నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్‌ బోర్డు తొలిసారిగా క్యూఆర్‌ కోడ్‌తో హాల్‌టికెట్లు జారీ చేస్తోంది. క్యూఆర్‌ కోడ్‌తో పాటు టోల్‌ ఫ్రీ నంబరు, జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌చార్జి నంబరు ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కంట్రోల్‌ రూమ్‌ నంబరును సంప్రదించాలి. విద్యార్థులు పరీక్ష కేంద్రం అడ్రస్‌ సులువుగా తెలుసుకొని, సమయానికి పరీక్షకు హాజరయ్యేందుకు క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగపడుతుంది.

------------------------------------------------------------------------

జిల్లాలో ఇంటర్‌ పరీక్ష కేంద్రాలు ఇలా..

------------------------------------------------------------------------

ప్రైవేటు జూనియర్‌ కళాశాలల కేంద్రాలు..20

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల కేంద్రాలు..15

ఆదర్శ పాఠశాలల కేంద్రాలు...13

మొత్తం పరీక్ష కేంద్రాలు...28

----------------------------------------------------------------------

ఇతర వివరాలు...

------------------------------------------------------------------------

చీఫ్‌ సూపరింటెండెంట్లు...28 మంది

డిపార్ట్‌మెంటల్‌ అధికారులు...28 మంది

అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు...13 మంది

పరీక్ష కేంద్రాల్లో బిగించిన సీసీ కెమెరాలు...140

------------------------------------------------------------------------

ఫస్టియర్‌ విద్యార్థుల వివరాలు

------------------------------------------------------------------------

జనరల్‌ కోర్సులు... 6,104 మంది

వృత్తి విద్యా కోర్సులు...969 మంది

మొత్తం ఫస్టియర్‌ విద్యార్థులు..12,499 మంది

------------------------------------------------------------------------

సెకండియర్‌ విద్యార్థుల వివరాలు

------------------------------------------------------------------------

జనరల్‌ కోర్సులు...6,395 మంది

వృత్తి విద్యా కోర్సులు...982 మంది

మొత్తం సెకండియర్‌ విద్యార్థులు..1,951 మంది

------------------------------------------------------------------------

అన్ని కోర్సుల విద్యార్థులు..

జనరల్‌ కోర్సు...7,073 మంది

వృత్తి విద్యా కోర్సు...7,377 మంది

జిల్లాలో మొత్తం విద్యార్థులు..14,450 మంది

------------------------------------------------------------------------

Updated Date - Mar 03 , 2025 | 01:08 AM