వత్తాసు పలకడం సరికాదు..
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:48 AM
వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక కన్వీ నర్‌గా ఉన్న తాటిపాముల దామోదర్ ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని, అది సరికాదని బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్ట ణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నా రు.

సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్ర జ్యోతి) : వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక కన్వీ నర్‌గా ఉన్న తాటిపాముల దామోదర్ ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని, అది సరికాదని బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్ట ణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నా రు. శనివారం సిరిసిల్ల పట్టణం అంబే ద్కర్ చౌరస్తా వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి చక్రపాణి నాయ కులు పూలమాలలు వేసి వినతిపత్రం ను సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, వస్త్ర పరిశ్రమ ఐక్య వేధిక కన్వీనర్‌కు సవాలు విసిరినట్టే అంబేద్కర్ విగ్రహం ఎదుట బహిరంగ చర్చకు కూర్చున్నారు. దాదాపు అరగం ట వరకు వేచిచూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐక్య వేదిక కన్వీనర్ రాలేదు. ఈ సందర్భంగా చక్ర పాణి మాట్లాడుతూ ఐక్య వేదిక కన్వీనర్ మొన్నటి రోజు తనపై వ్యక్తిగతంగా దూషణలు చేశాడని ఆరోపించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లలో రూ.3 కోట్ల పనులను చేసినానని కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక రూ.2కోట్లు ఇచ్చిందని ఆరోపణలు చేశార న్నారు.దీనిపై అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు వచ్చానన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని యజమానులు, ఆసాములు, కార్మికుల పక్షాన తాను మాట్లాడానని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిల బిల్లులు రూ.50శాతం ఉన్నాయని వాటి ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన్ అడగ ట్ల మురళి, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్య క్షుడు వెంగళ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, దార్ల సందీప్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సబ్బని హరీష్, బీఆర్‌ఎస్ పట్టణ నాయకులు భాస్కర్, శంకర్, బాలయ్య ఉన్నారు.