Share News

కుల గణన సర్వేతో బీసీ కులాలకు అన్యాయం..

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:57 AM

కుల గణన సర్వేతో బీసీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ మున్నూరు కాపు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.

కుల గణన సర్వేతో బీసీ కులాలకు అన్యాయం..

సిరిసిల్ల టౌన్‌/వేములవాడ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజోతి) : కుల గణన సర్వేతో బీసీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ మున్నూరు కాపు సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌ క్లబ్‌లో బీసీ కులగణన అన్యాయంపై మున్నూరు కాపుల రచ్చబండ కార్యక్రమం ను ప్రారంభించారు. అలాగే వేములవాడలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యం లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాటాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో మున్నూరు కాపులతో పాటుగా అన్ని బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే సర్వే లో బీసీల జనాభా తగ్గించారని ఆరోపించారు. మున్నూరు కాపులకు జరిగిన అన్యాయంపై వారం రోజుల పాటు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నా రు. ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేతో కూడా మున్నూరుకాపులకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నెలరోజుల సమయం తీసు కొని మున్నూరుకాపుల కులగణను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో జనాభ ప్రాతిపదికపై రిజర్వేషన్లు చట్టబద్దంగా కల్పించాలని ప్రభు త్వాన్ని జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్‌ కోరారు. ఆయా కార్యక్రమాల్లో మున్నూరుకాపు సంఘం పట్టణ కమిటీ సభ్యులు ఒజ్జల అగ్గిరాములు, కుల్ల సత్తయ్య, దుమాల రవి, చల్ల రవి, మాదం కుమార్‌, కొడి మ్యాల వేణు, ఎరుకల ప్రకాష్‌, పల్లికొండ నర్సయ్య, దుమాల రాములు, పడిగెల రాజు, కొట్టె శ్రీనివాస్‌, లింగంపల్లి రాము, పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడు తూపు కారి సత్తయ్య, మాజీ కౌన్సిలర్‌ మారం కుమార్‌, కొండ కనకయ్య, సీహెచ్‌ రామస్వామి గౌడ్‌, కూరగాయల మల్లేశం, కుంభం రవి, చేను హెలపతి, ఉయ్యా ల భూమయ్య గౌడ్‌, కంశాని శ్రీధర్‌, చవాన్‌ అర్జున్‌, బోగ శ్రీధర్‌, ఎట్టం సాయి కృష్ణ, మిద్దె వినీత్‌ గౌడ్‌, ఏదుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:57 AM