ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్‌పై యుద్ధం
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:57 AM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు మార్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలోని పచ్చీస్ ప్రభారీ ల సమావేశంలో ఆయన మాట్లారు.

భగత్‌నగర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు మార్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలోని పచ్చీస్ ప్రభారీ ల సమావేశంలో ఆయన మాట్లారు. ఈ ఎన్నిక లు నమ్మక ద్రోహానికి నయవంచనకు, పోరాటా నికి ధర్మ రక్షణకు మధ్య జరుగుతున్నాయ న్నారు. కాంగ్రెస్ నయవంచన, నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రులు, ఉపా ధ్యాయులకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలిచిన వారం రోజుల్లోనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్ సర్కార్‌పై యుద్ధం ప్రారంభిస్తుందన్నారు. తనకు కేంద్రమంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజలే తనకు ముఖ్యమన్నారు. కాంగ్రెస్ బీసీల కు వెన్నుపోటు పొడిచి ఇవాళ బీసీ జపం చేయ డం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం తథ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారం లోకి వస్తే బీసీని సీఎం చేస్తామని పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కాంగ్రెస్‌లో చేరతారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులే లేక పోటీ నుంచి తప్పుకున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకక బయటి వాళ్లను అరువు తెచ్చుకుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి పోటీ చేయబోన ని తప్పుకోవడమే ఆ పార్టీపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఓటు కోసం ఏడు వేల నుంచి పదివేల రూపాయలు పంచుతున్నారని, అయినా బాధపడాల్సిన పనిలేదన్నారు. ఎల్‌ఆర్ ఎస్ దరఖాస్తుకు లక్ష నుంచి పది లక్షల దాకా వసూలు చేయబోతున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ డబ్బులు ఆయా వార్డుల్లో అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకే జమ చేయాలని నిబంధన తీసుకు వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిం దన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యా యు ల పక్షాన పోరాడి జైలుకు, లాఠీ దెబ్బలు తిన్నదెవరో గుర్తుంచుకోవాలన్నా రు. పీఆర్సీలు, డీఏలు, బదిలీలు, ప్రమోషన్లు గ్రూప్-1 అభ్యర్థుల కోసం పోరాడిందెవరో గుర్తుంచుకోవాలన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ తాను గెలిస్తే వేతనమంతా పాఠశాలల అభివృద్ధికే ఖర్చు చేస్తానని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు ంగాడి కృష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్‌రావు, డి శంకర్, వాసల రమేష్ పాల్గొన్నారు.