Share News

ఆధునిక సాగు పద్ధతులతో అధిక ఉత్పత్తి

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:04 AM

ఆధునిక సాగు పద్ధ్దతులతో అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

ఆధునిక సాగు పద్ధతులతో అధిక ఉత్పత్తి

పెద్దపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ఆధునిక సాగు పద్ధ్దతులతో అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌ ప్రాంగణంలో విఘ్నేశ్వర డ్రోన్స్‌ సేల్స్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో 4డ్రోన్‌ వాహనాలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడు తూ ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు మరింత లాభం లబ్ధి చేకూరుతుందని, వ్యవసాయ యాం త్రీకరణలో భాగంగా నాట్లు వేయటం, పురుగుల మందు, గడ్డి మందు స్ర్పే చేయడం, ఎరువుల వినియోగం వంటి వాటికి డ్రోన్‌ సేవలను వినియోగిం చవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, విఘ్నేశ్వర డ్రోన్‌ నిర్వాహకులు రమేష్‌, సంపత్‌, మహేందర్‌, అఖిల్‌, రాజు సంబంధిత అధికా రులు, పాల్గొన్నారు.

జిల్లా గెజిటెడ్‌ అధికారుల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

జిల్లా గెజిటెడ్‌ అధికారుల సంఘం క్యాలెండర్‌ను గురువారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గెజిటెడ్‌ అధికా రులు అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్ర మాలను విజయవంతం చేయాలని, కోరా రు. ఈ సందర్భంగా అధ్యక్షులు తూము రవీందర్‌, కార్యదర్శి లెంకల బ్రహ్మా నందరె డ్డి, సహా అధ్యక్షులు కే అలివే ణి, కోశాధి కారి కే కరుణాకర్‌, ఉపాధ్యక్షులు వై కుమార్‌, ఎండీ సాజిద్‌ అలి, ఎన్‌ అంజని, ఎం కరుణాకర్‌, సంయుక్త కార్యద ర్శులు జి శ్రీనివాస్‌, ఎస్‌ మధు, జే అనూష, ఆర్‌ అలేఖ్య, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ జి సురేశ్‌, ప్రచారకార్యదర్శి శ్రీకాంత్‌, కార్యాల యకార్యదర్శి. శంకర్‌యాదవ్‌, సాంస్కృతిక కార్యదర్శి తిరుమల్‌, క్రీడల కార్యదర్శి మ ధుబాబు, కార్యవర్గ సభ్యులు గంగ ప్రణవ్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 01:04 AM