వైభవంగా అధ్యయనోత్సవం
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:54 AM
జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అధ్యయనోత్సవం, సాయంత్రం పరమపదోత్సవం వైభవంగా జరిగింది.
- వేంకటేశ్వరస్వామి ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ
- ఆలయంలో భక్తుల సందడి
కరీంనగర్ కల్చరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అధ్యయనోత్సవం, సాయంత్రం పరమపదోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తుల ఎదుట ద్రవిడ వేద పారాయణం మధ్య తొళ్ళక్కము, ప్రబంధ పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని భక్తులు దర్శించి పులకించిపోయారు. పారాయణాలు, భజనలు, కీర్తనలతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్ పాల్గొన్నారు.
ఫ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
ఉదయం, సాయంత్రం ఉత్సవాల కల్చరల్ ఆర్గనైజర్ గోగుల ప్రసాద్ నేతృత్వంలో భజనలు, కీర్తనలు, పారాయణాలు నిర్వహించారు. ప్రతీ రోజూ గోవిందపతి శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యంలో గోవిందనామాల ఆలాపన, గీతా భక్త సమాజం ఆధ్వర్యంలో గీతా పారాయణం జరుగనున్నాయి.
ఫ నేటి కార్యక్రమాలు..
మంగళవారం ఉదయం 9 గంటల నుంచి అంకురార్పణలో భాగంగా పాతబజార్ గౌరీశంకరాలయం నుంచి పుట్టమన్ను తెస్తారు. సాయంత్రం పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఽరాత్రి 6-30 గంటల నుంచి శేషవాహనసేవ, వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.